అమెరికా ప్రజలపై గన్స్ పేలుతూనే ఉన్నాయి. తాజాగా ఆ దేశంలోని అయోవా రాష్ట్రంలోని ఓ చర్చిలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు దుర్మరణం చెందారు. గురువారం సాయంత్రం అమెస్ అనే సిటీలోని కార్నర్ స్టోన్ చర్చి వద్ద జరిగిన ఈ ఘటనలో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి సైతం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ‘ఇది మతిలేని విధ్వంసం’ అని ఈ ఘటనను అయోవా గవర్నర్ కిమ్ రేనాల్డ్స్ ఖండించారు.