ఎపి: ముగ్గురు ఐఎఎస్​లకు జైలు

By udayam on May 7th / 6:07 am IST

మదన సుందర్​ గౌడ్​ అనే వ్యక్తి తనను విలేజ్​ అగ్రికల్చర్​ అసిస్టెంట్​గా ఎంపిక చేయకపోవడాన్ని సవాల్​ చేస్తూ 2019లో కోర్టుకెక్కిన కేసులో ఆంధ్రప్రదేశ్​ హైకోర్ట్ ముగ్గురు ఐఎఎస్​ అధికారులకు జైలు శిక్షలు విధించింది. కోర్టు ధిక్కరణ కింద వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ మాజీ కమిషనర్​ హెచ్​.అరుణ్​కుమార్​, పౌర సరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్​లకు జస్టిస్​ బట్టు దేవానంద్​.. 30 రోజుల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించారు.

ట్యాగ్స్​