అమెరికాలోని అరిజోనా సరస్సులో సోమవారం జరిగిన పడవ ప్రమాదంలో ముగ్గురు తెలుగు వారు మరణించారు. హరిత ముద్దన మరణించగా, ఆమె భర్త నారాయణ(49) గల్లంతయ్యారు. మంగళవారం ఆయన మృతదేహం లభ్యమైంది. ఆయనతో పాటు మరో తెలుగు వ్యక్తి గోకుల్ మడిశెట్టి మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. సోమవారం విహారయాత్ర కోసం ఓ సరస్సు వద్దకు వెళ్ళిన వారు ఫోటోస్ తీసుకుంటుంటే ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వారి మృతదేహాలు మూడు వారాల తర్వాత గుంటూరు చేరుకోనున్నాయి.