హైదరాబాద్​ నుంచి బెంగళూరు వెళ్తున్న గరుడ బస్సుకు ప్రమాదం.. ముగ్గురు మృతి

By udayam on November 21st / 11:33 am IST

హైదరాబాద్​ నుంచి బెంగళూరు వెళ్తున్న గరుడ బస్సు.. చెరకు లోడ్​ తో వెళ్తున్న ట్రాక్టర్​ ను ఢీకొట్టింది. తెలంగాణ లోని కొత్తకోట వద్ద నేషనల్​ హైవే 44 పై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. ఈ బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులుతో పాటు బస్సు సిబ్బంది ఉన్నారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్​