జమ్మూకశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ముంజ్ మార్గ్ ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో వీరిని మన సైన్యం మట్టుబెట్టింది.ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదులను షోపియాన్ కు చెందిన లతీఫ్ లోన్, అనంతనాగ్ కు చెందిన ఉమర్ నజీర్ గా గుర్తించారు. కాశ్మీరీ పండిత పురాణ కృష్ణ భట్ హత్యలో లతీఫ్ లోన్, నేపాల్ కు చెందిన టిల్ బహదూర్ థాపా హత్యలో ఉమర్ నజీర్ ప్రమేయం ఉందని పోలీసులు ట్వీట్ చేశారు.