తెలంగాణలోని బాసర ఐఐటిలో ర్యాగింగ్ భూతం పడగవిప్పింది. సీనియర్ విద్యార్థులు.. జూనియర్లను దారుణంగా ర్యాగింగ్ చేస్తున్నారంటూ హాస్టల్ యాజమాన్యం పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఐదుగురు సీనియర్ విద్యార్థుల (అందులో ముగ్గురు మైనర్లుగా గుర్తించారు)పై కేసు నమోదు చేశారు. గురువారం జరిగిన ఈ ఘటనపై ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు.. మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేస్తూ వారిని కొట్టారని ఎస్పి భైంసా వెల్లడించారు.