ఫ్రాన్స్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా మరో 3 రఫేల్ యుద్ధ విమానాలు భారత్కు చేరుకున్నాయి.
నిన్న సాయంత్రం భారత కాలమానం ప్రకారం 5.30 గంటలకు ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన ఈ భారీ యుద్ధ విమానం దారిలో ఎక్కడా ఆగకుండా దాదాపు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి నేరుగా భారత్కు చేరుకుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎయిర్ఫోర్స్ సహకారంతో మార్గమధ్యంలోనే ఇంధనాన్ని నింపుకుంది. వీటి రాకతో భారత్ వద్ద ఉన్న మొత్తం రఫేల్ యుద్ధ విమానాల సంఖ్య 11కు చేరుకుంది.
ఇప్పటికే గత ఏడాది జులై 29న మొదటి విడత రఫేళ్ళు భారత్కు చేరుకోగా సెకండ్ బ్యాచ్లో మరికొన్ని గత ఏడాది నవంబర్ 3న ఇక్కడకు చేరుకున్న విషయం తెలిసిందే.