శివసేన రెబల్ క్యాంప్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలు

By udayam on June 23rd / 5:20 am IST

మహారాష్ట్రలో మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు ఏక్​నాథ్​ శిండే క్యాంపులో చేరారు. దీంతో గత 24 గంటల్లో రెబల్​ క్యాంపుకు మొత్తం 7 గురు ఎమ్మెల్యేలు వచ్చినట్లయింది. దీంతో వారి బలం దాదాపుగా 50కు పెరిగింది. మరో వైపు శివసేన శాసనసభా పక్ష నేతగా ఏక్​నాథ్​ షిండేనే ఉంటారని రెబల్​ ఎమ్మెల్యేలు తీర్మానం పంపారు. దీనిపై మొత్తం 34 మంది ఎమ్మెల్యేలు సంతకం చేశారు. 2019లో ఏకగ్రీవంగా ఏక్‌నాథ్ శిందేను శివసేన లెజిస్లేచర్ పార్టీ నాయకునిగా ఎన్నుకున్నామని, ఇప్పుడు అదే హోదాలో ఆయన కొనసాగుతారని ఆ తీర్మానం చెబుతోంది.

ట్యాగ్స్​