లోయలో పడి ముగ్గురు జవాన్లు మృతి

By udayam on January 11th / 6:05 am IST

జమ్మూ కశ్మీర్ లో దారుణం చోటుచేసుకుంది. విధుల్లో భాగంగా గస్తీ కాస్తున్న ముగ్గురు సైనికులు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయారు. దీంతో ఆ ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. నార్త్ కశ్మీర్ లోని కుప్వారాలో 14వ బెటాలియన్ కు చెందిన ఒక అధికారి, ఇద్దరు జవాన్లు ఈ ప్రమాదంలో చనిపోయారు. ఫార్వార్డ్ ఏరియాలో ఈ ముగ్గురూ విధులు నిర్వహిస్తుండగా మంచు పెళ్లలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. దీంతో పట్టుతప్పి వాళ్లు ముగ్గురూ లోయలో పడిపోయారని చెప్పారు. వారికోసం గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలు దొరికాయని చీనార్ కోర్ కు చెందిన అధికారులు వివరించారు.

ట్యాగ్స్​