హుజూరాబాద్​ పోటీలో 30 మంది

By udayam on October 14th / 7:13 am IST

ఈ నెల 30 న జరగనున్న హుజూరాబాద్​ ఉప ఎన్నిక నుంచి 12 మంది తమ నామినేషన్లను విత్​డ్రా చేసుకున్నారు. బుధవారమే నామినేషన్ల విత్​ డ్రా కు ఆఖరి రోజు కావడంతో 12 మంది తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. విత్​ డ్రా చేసుకున్న వారి ఈటెల రాజేందర్​ సతీమణి ఈటెల జమున, కాంగ్రెస్​ రెబల్​ ఒంటెల లింగా రెడ్డిలు కూడా ఉన్నారు. మొత్తం 61 మంది అభ్యర్థులు నామినేషన్లు ఇవ్వగా వాటిలో 19 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. 11 మంది అవసరమైన పేపర్లను ఇవ్వలేదు. 12 మంది విత్​డ్రా చేసుకోగా 30 మంది పోటీలో ఉన్నారు.

ట్యాగ్స్​