విశాఖ పోరస్​ ల్యాంబ్​ నుంచి విషవాయువులు

30 మందికి అస్వస్థత

By udayam on June 3rd / 11:35 am IST

విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురం వద్ద ఉన్న పోరస్​ లాబొరేటరీస్​ కెమికల్​ ఫ్యాక్టరీ నుంచి విషవాయువులు వెలువడడంతో 30 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు లోనయ్యారు. వీరందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారని ఎస్పీ గౌతమి సాలి ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్​లో ఏలూరులోని పోరస్​ లాబొరేటరీస్​లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​