తెలంగాణ లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ కు రవాణా శాఖ గట్టి షాకే ఇచ్చింది. తాగి బండిని అతి వేగంగా నడుపుతున్న 3,220 మంది వాహనదారులకు వారి డ్రైవింగ్ లైసెన్స్ లు కట్ చేసింది. గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ ష్ట్రవ్యాప్తంగా మద్యంసేవించి వాహనాలు నడిపిన 5,819 మంది వాహనదారుల లైసెన్సులను రద్దు చేసినట్లు సైతం అధికారులు తెలిపారు. వాహనదారుల లైసెన్సుల సంఖ్య హైదరాబాద్ లో 4,109 కాగా.. నార్త్ జోన్ లో 1,103, సౌత్ జోన్ లో 1,151, ఈస్ట్ జోన్ లో 510, వెస్ట్ జోన్ లో 1,345 మంది లైసెన్సులు రద్దయ్యాయి.