చైనాలోని ఓ రసాయన కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో భారీ ప్రాణనష్టం సంభవించింది. అన్యాంగ్ నగరంలోని కయాక్సిండా ట్రేడింగ్ కో కంపెనీలో విద్యుత్ పరికరాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్లాంట్ లో అనుమానిత రసాయనాలను ఎక్కువ మోతాదులో నిల్వ చేసి ఉంచినట్లు అగ్నిప్రమాదం తర్వాత అధికారులు గుర్తించారు.