అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

By udayam on January 7th / 5:45 am IST

అండమాన్ : అండమాన్ నికోబార్ దీవుల్లోని కాంప్‌బెల్ తీరంలో దిగ్లీపూర్ గురువారం ఉదయం 6.57 గంటలకు  భూకంపం సంభవించింది. ఈమేరకు  అండమాన్ నికోబార్ అధికారులు చెప్పారు.

అండమాన్ నికోబార్ లోని ఈ భూకంప ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.

ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల్లో పలుసార్లు భూమి కంపించింది. గత ఏడాది జూన్ 10వతేదీన అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం వచ్చింది. గత ఏడాది మే 22వతేదీన కూడా అండమాన్‌లో భూమి కంపించింది.