అనకాపల్లి జిల్లా పరవాడలోగల రామ్‌కీ ఫార్మా సిటీలోని లారస్ లేబ్ యూనిట్-3లో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరొక కార్మికుని పరిస్థితి విషమంగా ఉంది.కంపెనీలో ఉత్పత్తిలేని ఎస్ ఫంక్షనింగ్ బ్లాక్‌ను శుభ్రం చేస్తుండగా రియాక్టర్ కింద రబ్బర్‌కు మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ పదిమంది కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.