సొసైటీ గోడ కూలి నలుగురు దుర్మరణం

By udayam on September 20th / 6:56 am IST

ఉత్తర ప్రదేశ్​లోని నోయిడాలో ఓ సొసైటీ బౌండరీ గోడ కూలి నలుగురు దుర్మరణం చెందారు. సెక్టార్​ 21లోని జల్​ వాయు విహార్​ గేటెడ్​ కమ్యూనిటీలో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు రెస్క్యూ ఆపరేషన్​ చేపట్టారు. మరణించిన వారంతా బదువాన్​ జిల్లా నుంచి వచ్చిన రోజువారీ కార్మికులే నని తెలుస్తోంది. డ్రైనేజీ రిపేర్​ వర్క్​ జరుగుతుండగా సొసైటీ కాంపౌండ్​ వాల్​ కూలడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం ఇదే రాష్ట్రంలో లక్నోలోని సైనిక భవనం ప్రహారీ గోడ కూలి 9 మంది కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​