కల్తీ మద్యం తాగి 4 గురు మృతి

By udayam on November 21st / 6:38 am IST

యూపీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమీలియా గ్రామంలో కల్తీ మద్యం తాగి నలుగురు మరణించిన ఘటన చోటుచేసుకుంది. ప్రయాగరాజ్ జిల్లా ఫూల్పూరు పోలీసుస్టేషను పరిధిలోని అమీలియా వద్ద కల్తీ మద్యం తాగి నలుగురు మరణించారని, మరో ఐదుగురిని ఆసుపత్రిలో చేర్చామని అధికారులు తెలిపారు.

కల్తీ మద్యం శాంపిళ్లను సేకరించి పరీక్షకు పంపించారు. మృతులను పోస్టుమార్టం కోసం తరలించారు. కల్తీ మద్యం విక్రేతలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. కల్తీ మద్యం విక్రయించిన అమీలియా గ్రామానికి అధికారులు హుటాహుటిన వచ్చి తనిఖీలు చేశారు.

పిడుగులు పడి 4గురు మృతి

కాగా ఈజిప్టు దేశంలోని కోస్టల్ సిటీ అలెగ్జ్రాండ్రియాలో కురుస్తున్న భారీవర్షాలకు పిడుగులు పడిన ఘటనలో రెండు ఇళ్లు కుప్పకూలి నలుగురు మరణించారు. అలెగ్జ్రాండ్రి యా జిల్లా అల్ గోమరాక్, కర్మౌజ్ ప్రాంతాల్లో భారీవర్షాలు, పిడుగులు పడటం వల్ల రెండు ఇళ్లు కుప్పకూలిపోయాయి.

నలుగురు అక్కడి అక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అతి భారీవర్షాలు, పిడుగులు పడుతుండటంతో జనం భయాందోళనలు చెందుతున్నారు.