రంగారెడ్డి: చిన్నారులను మింగేసిన చెరువు

By udayam on October 3rd / 5:51 am IST

గాంధీ జయంతి రోజున రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అభం శుభం తెలియని నలుగురు చిన్నారులు చెరువులో ఈతకు దిగి మునిగిపోయారు. గొల్లగూడ గ్రామంలోని ఎర్రకుంట వద్దకు వచ్చిన కహ్లీద్​ (12), సమ్రీన్​ (14), ఇమ్రాన్​ (9), రెహాన్​ (10)లు ఆ చెరువులో ఉన్న పెద్ద గుంతను గుర్తించక ఇరుక్కుపోయారు. ఒకరిని కాపాడబోయి ఒకరు నదిలోకి దిగి అందరూ మరణించారు. వ్యవసాయ బావి వద్ద పనిచేస్తున్న రైతు లక్ష్మయ్య చిన్నారుల అరుపులు విని గ్రామస్థులతో కలిసి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

ట్యాగ్స్​