ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఆగి ఉన్న లారీని టాటా మాజిక్ వాహనం ఢీకొనడంతో దుర్ఘటన జరిగింది. మల్లేపల్లి జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుఝామున ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో టాటా మ్యాజిక్ ఆటోలో మొత్తం 13 మంది ఉన్నారు. ఒకరు ఘటనా స్థలంలోనే మరణించగా.. మరో ముగ్గురు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.