జమ్మూ కాశ్మీర్ లోని సిధ్రా సెక్టార్ లో బుధవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ ట్రక్కు కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు దాన్ని వెంబడించారు. చెక్‌పోస్ట్ వద్ద ట్రక్కుని ఆపగా డ్రైవర్ పరారయ్యాడు. ట్రక్కుని వెతికేందుకు యత్నిస్తుండగా అందులో దాగి ఉన్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు కూడా వెంటనే స్పందించాయని.. కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారని జమ్ము అదనపు డైరెక్టర్ జనరల్ ముఖేష్ సింగ్ తెలిపారు.