అయోధ్య రామ మందిరం వద్ద డ్యాన్స్​ చేసిన కానిస్టేబుల్స్​ సస్పెండ్​

By udayam on December 16th / 7:40 am IST

పవిత్ర స్థలంలో డ్యాన్సులు వేసి అపవిత్రం చేశారంటూ నలుగురు మహిళా కానిస్టేబుల్స్‌పై సస్పెండ్‌ వేటు వేసింది యుపి ప్రభుత్వం. గురువారం ఈ ఘటన జరిగింది. వీరు డ్యాన్స్‌ చేసింది అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో. దీనిపై ఆగ్రహించిన యోగి ప్రభుత్వం వారిని విధుల నుండి తొలగించిందని అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న కవితా పటేల్‌, కామిని కుష్వాహా, కాశిష్‌ సాహ్ని, సంధ్యా సింగ్‌లు భోజ్‌పురి పాటకు డ్యాన్స్‌ వేశారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్​