200 ఎంపి కెమెరాతో రెడ్​ మీ నోట్​ 12 ప్రో

By udayam on January 9th / 5:52 am IST

భారత్​ లో ఎక్కువుగా అమ్ముడు పోయే మిడ్​ ఎండ్​ ఫోన్లలో రెడ్​ మీ నోట్​ సిరీస్​ ఫోన్లు టాప్​ లో ఉంటాయి. తాజాగా ఈ సిరీస్​ నుంచి 12వ వర్షన్​ ఫోన్ ను భారత్​ లో లాంచ్​ చేశారు. 12 ప్రో ప్లస్ 5జీ పేరిట వచ్చిన ఈ ఫోన్ లో 200 ఎంపి కెమెరా ప్రధాన ఆకర్షణ. 6.7 అంగుళాల డిస్ ప్లే ఫుల్ హెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్ సెట్, డ్యూయల్ స్పీకర్ సెటప్ తదితర ఫీచర్లూ ఉన్నాయి. అలాగే 8 మెగాపిక్సల్, 2 మెగాపిక్సల్ సెన్సార్లను కూడా ఏర్పాటు చేశారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వల్ల బ్లర్ కాకుండా ఫొటోలు తీసుకోవడానికి వీలవుతుంది.

ట్యాగ్స్​