రాజ్యసభ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపాదించిన నలుగురు సభ్యులు ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవమయ్యారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనా ఈ మేరకు ప్రకటన చేశారు. శుక్రవారమే నామినేషన్ల విత్‌డ్రాకు చివరి రోజు కావడంతో అప్పటికి కేవలం 4 నామినేషన్లే ఉండడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. దీంతో వి.విజయసాయి రెడ్డి, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, ఎస్.నిరంజన్‌రెడ్డిలు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎంపికయ్యారు.
క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య, ఎస్.నిరంజన్ రెడ్డి. రాజ్యసభకు ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్ తీసుకున్న అనంతరం సీఎంని కలిసి కృతజ్ఞతలు తెలిపిన నూతన రాజ్యసభ సభ్యులు. pic.twitter.com/L4S871uabL
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 3, 2022