గుట్కా ప్యాకెట్లలో రూ.32 లక్షల డాలర్లు

By udayam on January 10th / 6:13 am IST

గుట్కా ప్యాకెట్లలో విదేశీ కరెన్సీ అక్రమ రవాణా చేస్తున్న ఘటన పశ్చిమ బెంగాల్ లో వెల్లడైంది. కోల్ కతా నుంచి థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ వెళుతున్న ప్రయాణికుడి నుంచి ఈ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. కోల్ కతా కస్టమ్స్ విభాగానికి చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) అధికారులు బ్యాంకాక్ వెళుతున్న ఆ ప్రయాణికుడిని అడ్డుకున్నారు. అతడి లగేజీని తనిఖీ చేసిన అధికారులు పెద్ద ఎత్తున గుట్కా ప్యాకెట్లను కనుగొన్నారు. వాటిని తెరిచి చూడగా, అందులో గుట్కాతో పాటు రూ.32 లక్షల అమెరికా డాలర్లు దర్శనమిచ్చాయి.

ట్యాగ్స్​