రిపోర్ట్​ : 5 బ్యాక్టీరియాలతో 6.8 లక్షల మరణాలు

By udayam on November 23rd / 11:00 am IST

ఐదు ప్రాణాంతక బ్యాక్టీరియాల వల్ల 2019లో 6.8 లక్షల మరణాలు దేశంలో సంభవించాయని లాన్సెట్‌ అధ్యయనం స్పష్టం చేసింది. ఎస్చెరిచియా కోలి, స్ట్రెప్టోకోకస్‌ న్యుమోనియా, క్లెబ్సియెల్లా న్యుమోనియా, స్టెఫిలోకాకస్‌ ఆరియస్‌, అసినెటోబాక్టర్‌ బామానీల వల్లే ఈ మరణాలు సంభవించాయి. ఇ.కోలి వల్ల దేశంలో 1.6 లక్షల మంది మరణించగా, ప్రపంచవ్యాప్తంగానూ ఎక్కువ మరణాలకు ఈ ఇన్ఫెక్షన్‌ ప్రధాన కారణమని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 77 లక్షల మరణాలకు 11 ఇన్ఫెక్షియస్‌ సిండ్రోమ్‌లలోని 33 బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు కారణమని తెలిపింది. ఈ పరిశోధనలో 11,361 ప్రాంతాల్లో 343 మిలియన్ల ప్రజల డేటాను సేకరించామని తెలిపింది.

ట్యాగ్స్​