పంజాబ్​: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

By udayam on January 9th / 10:00 am IST

పంజాబ్‌లోని జలంధర్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్, కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఏడాదిన్నర చిన్నారి ఉంది. వీరంతా బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు హాజరై ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. జలంధర్ రోడ్డులో ఒక్కసారిగా అదుపుతప్పిన కారు ముందువెళ్తున్న బైక్‌ను ఢీకొట్టి అనంతరం టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది.

ట్యాగ్స్​