తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ఒకదానికొకటి వాహనాలు ఢీకొన్నాయి. రెండు బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఢీకొన్నాయి. ఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. కడలూరు తురుచ్చి నేషనల్ హైవేపై వేప్పర్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.