మొసలిని మింగేసిన పైథాన్​

By udayam on November 16th / 9:34 am IST

భారీ పైథాన్ పాములకు పేరుగాంచిన​ అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో నమ్మశక్యం కాని ఘటన చోటు చేసుకుంది.5 అడుగుల పొడవున్న అలిగేటర్​ (మొసలి జాతికి చెందినది)ను ఈ 18 అడుగుల పైథాన్​ అమాంతం మింగేసింది. ఎవర్​ గ్లేడ్స్​ జాతీయ పార్క్​ లో జరిగిన ఈ ఘటనను పార్క్​ లో పనిచేసే సిబ్బంది ముందుగా గుర్తించారు. కదలకుండా పడి ఉన్న భారీ పైథాన్​ కడుపులో మొసలి కదులుతుండడాన్ని అధికారులకు చెప్పడంతో దీనిని వెంటనే ఆపరేషన్​ కేంద్రానికి తరలించారు. అయితే ఆపరేషన్​ క్రమంలో పైథాన్​ కూడా మరణించింది. అప్పటికే దాని కడుపులోని మొసలి సైతం కన్నుమూసింది

ట్యాగ్స్​