రాజస్థాన్​ : ఘోర ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం

By udayam on January 2nd / 5:23 am IST

రాజస్థాన్​ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. వేగంగా వెళ్తున్న కారును లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఇటుకల లోడుతో వస్తున్న లారీ బస్రాసర్ గ్రామ సమీపంలో బలంగా కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు ఆసుపత్రి తరలిస్తుండగా మృతి చెందారని పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్​