పుణె వద్ద ఎపి లారీ బీభత్సం.. 48 వాహనాలను తొక్కుకుంటూ పోయిన ట్యాంకర్​

By udayam on November 21st / 10:34 am IST

మహారాష్ట్రలోని పూణెలో బ్రేకులు ఫెయిలైన ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్​ నుంచి బయల్దేరిన ఈ లారీ నవాలే వంతెన వద్దకు వచ్చే సరికి బ్రేకులు ఫెయిల్​ అయ్యాయి. దీంతో అతి వేగంతో పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ క్రమంలో దాదాపు 48 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. పుణె ఫైర్​ బ్రిగేడ్​, పుణె మెట్రోపాలిటన్​ రీజియన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ రెస్క్యూ టీమ్​ లు క్షతగాత్రులను హుటాహుతిన ఆసుపత్రికి తరలించాయి. ఈ యాక్సిడెంట్​ కారణంగా ముంబై రహదారిపై 2 కి.మీ.ల మేర ట్రాఫిక్​ గంటల పాటు నిలిచిపోయింది.

ట్యాగ్స్​