బలూచిస్థాన్​ పేలుళ్ళలో ఐదుగురు పాక్​ జవాన్లు మృతి

By udayam on December 26th / 8:27 am IST

పాకిస్థాన్​ లోని వివాదాస్పద బలూచిస్థాన్​ ప్రావిన్స్​ లో ఆదివారం జరిగిన వరుస బాంబు పేలుళ్ళలో ఐదుగురు పాకిస్థాన్​ జవాన్లు మృతి చెందారు. మరో 12 మంది పౌరులు గాయపడ్డారు. డిసెంబరు 24 నుంచి బలూచిస్థాన్‌లో పాక్ ఆర్మీ ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం శక్తిమంతమైన ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ ను పాక్​ సైనికులే లక్ష్యంగా ఆందోళనకారులు పేల్చారు. మరోవైపు, క్వెట్టాలోని శాటిలైట్ టౌన్‌లో ఉన్న పోలీస్ చెక్ పోస్టుపై గుర్తు తెలియని వ్యక్తులు గ్రనేడ్ విసిరారు. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు.

ట్యాగ్స్​