కేంద్రం: ఎపిలో 50,677 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ

By udayam on December 15th / 5:57 am IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో 50,677 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. రాజ్యసభలో ఆమ్​ ఆద్మీ పార్టీ ఎంపి సంజయ్ సింగ్‌ అడిగిన ప్రశుకు లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడించారు. 2021-22లో ఏపిలో 50,677, తెలంగాణలో 18,588 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. దేశంలో ఉనుత విద్యా సంస్థల్లో 3,753 బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వైసిపి ఎంపి ఆర్‌ కృష్ణయ్య అడిగిన మరో ప్రశుకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్‌ సమాధానం ఇచ్చారు.

ట్యాగ్స్​