తైవాన్​ ను కుదిపేసిన భారీ భూకంపం..

By udayam on December 16th / 5:09 am IST

తైవాన్‌ తూర్పు తీర ప్రాంతంలో గురువారం 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపంతో ఎలాంటి ప్రాణ నష్టం, భారీ ఆస్థి నష్టం సంభవించలేదని ఆ దేశ వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు తీర ప్రాంతంలోని హువాలియన్‌ పట్టణానికి ఆగేయంగా 29 కిలోమీటర్ల దూరంలో, 5.7 కిలోమీటర్ల లోతున కేంద్రంగా ఈ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో రాజధాని తైపీలోనూ భవనాలు ఒక నిమిషం పాటు కంపించాయి. ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. కొన్ని గంటల పాటు అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి.

ట్యాగ్స్​