ఆఫ్రికా దేశాలపై ట్రావెల్​ బ్యాన్​

By udayam on November 27th / 4:44 am IST

ఆఫ్రికా దేశాల్లో బయటపడ్డ అత్యంత ప్రమాదకర కొవిడ్​ వేరియంట్​కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమ్రికాన్​ అని పేరు పెట్టింది. 2 డోసుల కరోనా వ్యాక్సిన్​ తీసుకున్న వారిని సైతం ఈ వైరస్​ వదిలిపెట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో దీనిని ‘అత్యంత ప్రమాదకర వేరియంట్​’గా ప్రకటించింది. ఈ ప్రకటనతో బ్రిటన్​, బ్రెజిల్​ దేశాలు ఈ వైరస్​ బయటపడ్డ సౌత్​ ఆఫ్రికా, బోట్సువానా, లెసోతో, ఎస్వాటిని, జింబాబ్వే, నమీబియా దేశాల నుంచి ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. డబ్ల్యుహెచ్​ఓ ఆంక్షలు తొలగించే వరకు ఈ ట్రావెల్​ బ్యాన్​ అమలులో ఉంటుందని ఆయా దేశాలు ప్రకటించాయి.

ట్యాగ్స్​