పూరి జగన్నాథ ఆలయంలో తొక్కిసలాట.. స్టూడెంట్స్​ కు గాయాలు

By udayam on December 27th / 10:55 am IST

ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు పాఠశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మయూర్ భంజ్ జిల్లాలోని రస్ గోవింద్ పూర్ ప్రాంతంలో గల హ్రుదానంద హైస్కూల్ కు చెందిన 70 మంది విద్యార్థులు క్రిస్మస్ సెలవు సందర్భంగా పూరీ ఆలయ సందర్శనకు వెళ్లారు. ఆలయ మెట్లు ఎక్కుతుండగా బాలికలు తొక్కిసలాటలో చిక్కుకుని స్పృహ తప్పి పడిపోయారని ఆలయ అధికారులు తెలిపారు. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్​