అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.చింతూరు మండలం బొడ్డగూడెం వద్ద లారీ, మినీ వ్యాన్ మంగళవారం ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.బాధితులు ఛత్తీస్ గఢ్ నుంచి భద్రాచలం సీతారాముని ఆలయ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం సంభవించింది. మినీ వ్యాన్ లో ఉన్న మరికొందరికీ తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు క్షతగాత్రులు ఛత్తీస్ గఢ్ వాసులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.