చెన్నై సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రెండు భారీ ట్రక్కుల మధ్య మినీ ట్రక్కు చిక్కుకుపోవడంతో ఆరుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జీఎస్టీ రోడ్డులో జానకీపురం వైపు వెళుతుండగా, మినీ ట్రక్కు ఒక్కసారిగా అదుపు తప్పి ఎదురుగా ఉన్న భారీ ట్రక్కును ఢీకొట్టింది. వాహనంలో ఉన్నవారు పూర్తిగా బయటకు రాకముందే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ… మినీ లారీని బలంగా ఢీకొట్టడంతో ట్రక్కు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.