ఒడిశా రాష్ట్రం గంజామ్ జిల్లా కళింగ ఘాట్ వద్ద మంగళవారం రాత్రి బస్సు బోల్తా పడిన ఘటనలో 6 గురు మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు. ‘ఆ సమయంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన పర్యాటకులు దరింగ్‌బడి హిల్ స్టేషన్ నుంచి తిరుగు పయనం అయ్యారు. బ్రేక్ విఫలం కావడం వల్ల లేదా బస్సు డ్రైవర్‌కు ఘాట్ రోడ్డుపై డ్రైవింగ్ చేయడం కొత్త కావడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు’ అని ఫైర్ ఆఫీసర్ ప్రధాన్ అన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.