ఇటీవల కొవిడ్ జీరో నిబంధనల్లో సడలింపులు తీసుకొచ్చిన చైనాలో కరోనా కేసులు భారీసంఖ్యలో నమోదవుతున్నాయి. ఆ దేశంలో వచ్చే మూడు నెలల్లో 60 శాతం మంది జనాభాకు కొవిడ్ సోకుతుందని తాజా నివేదికలు సైతం హెచ్చరిస్తున్నాయి. అదే సమయంలో కొవిడ్ తో మరణాల శాతమూ భారీగా పెరుగుతుందని పేర్కొంది. ‘కొవిడ్ మరణాలు మిలియన్ల సంఖ్యలో ఉంటాయి. దేశంలోని ప్రతీ ఆసుపత్రీ రోగులతో నిండిపోనుంది. చైనా జనాభాలో 60 శాతం. అంటే భూమి జనాభాలో 10 శాతం ఈ వైరస్ బారిన పడనుంది’ అని చైనా అధికారులే స్వయంగా ప్రకటిస్తున్నారు.