బస్సులో అగ్ని ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

By udayam on June 3rd / 8:08 am IST

హైదరాబాద్​కు చెందిన ఓ ప్రైవేటు లగ్జరీ బస్సులో మంటలు చెలరేగి 7 గురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. కర్ణాటకలోని కలబురాగి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారంతా హైదరాబాద్​ వాసులేనని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో 12 మంది ప్రయాణికులకు కాలిన గాయాలవ్వడంతో వారిని కలబురాగిలోని ఆసుపత్రికి తరలించారు. మంటలు అంటుకున్న బస్సులో చిక్కుకుపోయిన ఏడుగురు ప్రయాణికులు బయటకు రాలేక మంటల్లో కాలిపోయారని కలబురాగి జిల్లా ఎస్పీ ఇషా పంత్​ తెలిపారు.

ట్యాగ్స్​