గాజా స్ట్రిప్​ అగ్నిప్రమాదం : ఏడుగురు చిన్నారులతో సహా 21 మంది సజీవదహనం

By udayam on November 18th / 5:47 am IST

పాలస్తీనా, ఇజ్రాయెల్​ సరిహద్దు ప్రాంతం గాజా స్ట్రిప్​ లోని ఓ బహుళ అంతస్తుల నివాస భవనంలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 21 మంది అందులో ఏడుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో నాలుగు అంతస్థుల భవనం మొత్తం పూర్తిగా కాలిపోయింది. బిల్డింగ్​ లో భారీ ఎత్తున గ్యాస్​ సిలిండర్లను భద్రపరిచారని, అందువల్లే ప్రమాద తీవ్రత భారీగా ఉందని ఫైర్​ సిబ్బంది ప్రకటించారు. వారు కాపాడేందుకు ఎలాంటి అవకాశం లేకపోయిందని, చిన్నారులు, మహిళలు తమ కళ్ళ ఎదుటే కాలిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ట్యాగ్స్​