అంబులెన్స్​ డ్రైవర్​ నిర్లక్ష్యం.. 7 గురు మృతి

By udayam on May 31st / 6:08 am IST

ఢిల్లీ నుంచి వస్తున్న ఓ అంబులెన్స్​ను ట్రక్​ గుద్దిన ఘటనలో 7 గురు దుర్మరణం చెందారు. ఫతేహ్​గంజ్​ పశ్చిమ్​ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో అంబులెన్స్​ డ్రైవర్​ అతి వేగంతో బండిపై కంట్రోల్​ పోగొట్టుకుని డివైడర్​ను గుద్ది అవతల రోడ్డులో వెళ్తున్న ట్రక్​ను ఢీకొట్టాడు. దీంతో 7 గురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మరణించారని బరేలీ పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అంబులెన్స్​ డ్రైవర్​ తాగి ఉన్నాడేమోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్​