రోడ్డుప్రమాదంలో 7గురు సజీవ దహనం

By udayam on November 21st / 11:06 am IST

గుజరాత్‌: గుజరాత్ లోని సురేంద్రనగర్‌లో అదుపుతప్పిన డంపర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం కాగా ఆ కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు సజీవ దహనమైయ్యారు.

చోటిలమాత దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.

ఈ ప్రమాదంలో సురేంద్రనగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం గురించి తెలుసుకుని ,పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.

క్షతగాత్రులను సమీపంలోకి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.