మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఓ రెండంతస్థుల బిల్డింగ్‌లో మంటలు చెలరేగి 7 గురు సజీవ దహనమయ్యారు. శనివారం తెల్లవారుఝామున 3.10 గంటలకు జరిగిన ఈ ఘటనలో మరణించిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరో 9 మంది సురక్షితంగా బయటపడగా వీరిలో 5 గురికి కాలిన గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బేస్మెంట్లోని మెయిన్ ఎలక్ట్రిక్ సిస్టమ్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగానే బిల్డింగ్‌లో మంటలు చెలరేగాయని తెలుస్తోంది.