4:03 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

బస్సు, బోలెరో ఢీ – 7గురు మృతి 2 weeks ago

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో పిలిభిత్‌ డిపో నుంచి లక్నోకు బయలుదేరిన బస్సును బోలెరో ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. పిలిబిత్‌, ఖుషీనగర్‌ జిల్లాలను కలిపే జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. శనివారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పిలిభిత్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ జై ప్రకాష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో ఒక మహిళ సహా ఏడుగురు మరణించారు.

మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. స్వల్పంగా గాయపడిన 32 మందిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది, బొలెరోలో 10 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.