పడవ బోల్తా.. ఏడుగురు గల్లంతు

By udayam on December 31st / 6:50 am IST

బీహార్‌లోని పాట్నాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు గల్లంతయ్యాయి. గంగానదిలో పడవ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 14 మంది బోటులో ఉన్నట్లు తెలిపారు. మహ్వీర్ తోలా ఘాట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సామర్థ్యానికి మించి పడవలో ఎక్కువ మంది ఎక్కడం వల్లనే పడవ బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతయిన వారి కోసం సహాయక బృందాలు వెతుకుతున్నాయి. కొందరి మృతదేహాలు లభించినట్లు తెలిసింది.

ట్యాగ్స్​