లడఖ్ లోని తుర్తుక్ సెక్టార్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారత జవాన్లు దుర్మరణం చెందారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు పై జారిపోయి పక్కనే ఉన్న ష్యోంక్ నదిలోకి దూసుకుపోయింది. ఈ సమయంలో 26 మంది జవాన్లు హనీఫ్ సబ్ సెక్టార్లోని పర్తాపూర్కు వెళ్తున్నట్లు ఆర్మీ ప్రకటించింది. మరో 10 మందికి పైగా జవాన్లు గాయపడ్డట్లు ఆర్మీ వెల్లడించింది.