భూమి మీదే సూర్యుడి కంటే 7 రెట్ల వేడి..

By udayam on September 14th / 9:13 am IST

దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కృత్రిమ సూర్యుడు (న్యూక్లియర్​ ఫ్యుజన్​ రియాక్టర్​) దాదాపు 100 మిలియన్​ డిగ్రీల సెల్సియస్​ వేడికి చేరుకుంది. సూర్యుడి అంతర్భాగంలో జరిగే న్యూక్లియర్​ ఫ్యుజన్​ను పోలినట్లే ఈ కృత్రిమ సూర్యుడిని అభివృద్ధి చేశారు. దీని సాయంతో అపరిమితంగా క్లీన్​ ఎనర్జీని ఉత్పత్తి చేయడమే తమ లక్ష్యమని సౌత్​ కొరియా పేర్కొంది. అయితే ఈ ఫ్యుజన్​లో 100 మిలియన్​ డిగ్రీల సెల్సియన్​ కేవలం 20 సెకండ్లు మాత్రమే ఉందని తెలిపింది.

ట్యాగ్స్​