వయసు కేవలం ఓ నెంబర్ మాత్రమే నిరూపించారు మైకెల్ కిష్ అనే వృద్ధుడు. 70 ఏళ్ళ వయసులో 100 మీటర్ల రిలే రేసును కేవలం 13.47 సెకండ్లలో పూర్తి చేసి తానింకా యువకుడినేనని నిరూపించుకున్నాడు. అమెరికాకు చెందిన ఈ కిష్ అనే వ్యక్తి గత గగురువారం పెన్ రిలే పోటీల్లో 70 ఏళ్ళ వయసు కేటగిరీలో పాల్గొని తన సత్తా చాటాడు. స్పోర్టింగ్ బ్లాక్ సన్‌గ్లాసెస్ పెట్టుకుని తన మనవరాళ్ళు చూస్తుండగానే అతడు ఈ రిలేను పూర్తి చేసిన వీడియోకు 19 లక్షల వ్యూస్ వచ్చాయి.
Michael Kish wins Penn Relays 70-year-old 100m race in 13.47!! 🤯
📺: https://t.co/PVPuMyyitJ pic.twitter.com/Cyrn2toBDa— FloTrack (@FloTrack) April 28, 2022