బోటు తిరగబడి 75 మంది గల్లంతు

By udayam on May 25th / 12:21 pm IST

వలసదారులతో వెళ్తున్న ఓ బోటు ట్యునీషియా వద్ద సముద్రంలో మునిగిపోవడంతో 75 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నుంచి 24 మంది ప్రాణాలతో బయటపడగా.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ట్యునీషియా వద్ద ఉన్న మెడిటేరియన్​ సముద్రంలో గత కొద్ది నెలల్లో బోట్లు తిరగబడి వందలాది మంది ప్రాణాలను కోల్పోయారు. అయినప్పటికీ వలసదారులు ప్రాణాలకు తెగించి సముద్రంలో ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. 2021లో ఇలా ప్రయాణించే 23 వేల మంది ఇటలీ చేరుకున్నారు.

ట్యాగ్స్​